Narendra Modi: లోక్ సభ 2024 ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్ర పక్షాలు హాజరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, జితన్ రాం మాంఝి, ఓం ప్రకాష్ రాజ్ బర్, సంజయ్ విషాద్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన బాబా కాల భైరవుడికి ప్రార్థన చేశారు. ఆ తరువాత గంగానది దశాశ్వ మేద ఘాట్ వద్ద పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయం వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇది మూడోసారి.
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG
— ANI (@ANI) May 14, 2024