Friday, October 30, 2026

రాజకీయ నాయకులకు ఇన్ టైంలో అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

కరీంనగర్, జనతా న్యూస్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా ప్రచారానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాటికి ఇన్ టైంలో అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మొదటి విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సువిధ కింద ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకునేందుకు అనుమతి కోసం రాజకీయ పార్టీల నాయకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. తర్వాత వాటికి సంబంధించిన అనుమతులు వెంట వెంటనే ఇన్ టైంలో ఇవ్వాలని ఆదేశించారు.

ఎక్కడ జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతోపాటు సువిధ కింద రాని వాటికి సంబంధించిన అనుమతులపై సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ ను అధికారులు అందరూ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన పై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, సీపీఓ కొమురయ్య, డీపీఓ రవీందర్, డీఐఓ శివరాములు, ఎస్వో దత్తారెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page