Tuesday, November 3, 2026

ఒకే జిల్లా.. ఒకే సామాజిక వర్గం.. ఇక్కడ పోరు రసవత్తరం..

కరీంనగర్ బ్యూరో,జనతా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీలో గట్టి పోటీ ఇస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో పోటా పోటీ నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆసక్తిగా మారింది. సాధాారణంగా ప్రధాన పార్టీల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరైనా.. స్థానికేతరులు ఉంటారు. కానీ  ఇక్కడ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన బరిలో ఉన్నారు. దీంతో ఆ సమాజిక ఓటు ఎటువైపు వెళ్తుందోనని ఆసక్తిగా మారింది.

కరీంనగర్ ఒకప్పుడు వెలమలకు కంచుకోట. ఒక్కడ పోటీలో ఉండే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించేది వారే. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఒక పర్యాయానికి ముందు వెలమ వర్గానికి చెందిన వారే ప్రజాప్రతినిధులుగా కొనసాగారు. కానీ గంగుల కమలాకర్ వెలుగులోకి వచ్చాక బీసీ నియోజకవర్గంగా మారింది. ఆయన ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచారు. నాలుగోసారి బరిలోకి నిలిచారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో మరోసారి గంగుల గెలుపు ఖాయం అని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు.

అయితే బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్ కు ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. బండి సంజయ్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్ర పగ్గాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో బండి సంజయ్ ని ఈసారి గెలిపించి అసెంబ్లీలోకి పంపాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గాన్ని సైతం చేజిక్కించుకోవాలని ఒక్కడ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ముందుగా కొత్త జయపాల్ రెడ్డిని అనుకున్నా.. గంగుల కమలాకర్ కు గట్టిపోటీ ఇవ్వడానికి ఆయన సమాజిక వర్గానికి చెందిన పురమళ్ల శ్రీనివాస్ ను బరిలోకి దింపిడమే కరెక్ట్ అని ఆలోచించి ఆయనకే టికెట్ కేటాయించారు. పురమళ్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్ గా సుపరిచితుడు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి తానే గట్టి పోటీ అని ఆయన ప్రచారం చేస్తున్నారు.

కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఉన్న వీరు ఒకే జిల్లాకు చెందిన స్థానికులు కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అవడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా కరీంనగర్ లో ఉన్న ఈ సామాజిక వర్గ ఓట్లు ఎవరికి ఎన్ని ఓట్లు పడుతాయోనని రాజకీయంగా చర్చించుకుంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page