కరీంనగర్ బ్యూరో,జనతా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీలో గట్టి పోటీ ఇస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో పోటా పోటీ నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆసక్తిగా మారింది. సాధాారణంగా ప్రధాన పార్టీల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరైనా.. స్థానికేతరులు ఉంటారు. కానీ ఇక్కడ ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన బరిలో ఉన్నారు. దీంతో ఆ సమాజిక ఓటు ఎటువైపు వెళ్తుందోనని ఆసక్తిగా మారింది.
కరీంనగర్ ఒకప్పుడు వెలమలకు కంచుకోట. ఒక్కడ పోటీలో ఉండే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించేది వారే. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఒక పర్యాయానికి ముందు వెలమ వర్గానికి చెందిన వారే ప్రజాప్రతినిధులుగా కొనసాగారు. కానీ గంగుల కమలాకర్ వెలుగులోకి వచ్చాక బీసీ నియోజకవర్గంగా మారింది. ఆయన ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచారు. నాలుగోసారి బరిలోకి నిలిచారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో మరోసారి గంగుల గెలుపు ఖాయం అని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్ కు ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. బండి సంజయ్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్ర పగ్గాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో బండి సంజయ్ ని ఈసారి గెలిపించి అసెంబ్లీలోకి పంపాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గాన్ని సైతం చేజిక్కించుకోవాలని ఒక్కడ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ముందుగా కొత్త జయపాల్ రెడ్డిని అనుకున్నా.. గంగుల కమలాకర్ కు గట్టిపోటీ ఇవ్వడానికి ఆయన సమాజిక వర్గానికి చెందిన పురమళ్ల శ్రీనివాస్ ను బరిలోకి దింపిడమే కరెక్ట్ అని ఆలోచించి ఆయనకే టికెట్ కేటాయించారు. పురమళ్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్ గా సుపరిచితుడు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి తానే గట్టి పోటీ అని ఆయన ప్రచారం చేస్తున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ బరిలో ఉన్న వీరు ఒకే జిల్లాకు చెందిన స్థానికులు కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అవడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా కరీంనగర్ లో ఉన్న ఈ సామాజిక వర్గ ఓట్లు ఎవరికి ఎన్ని ఓట్లు పడుతాయోనని రాజకీయంగా చర్చించుకుంటున్నారు.