ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, కిష్ట్రారావ్ పల్లే పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్న లంబాడి శ్రీనివాస్ ఏకంగా 9 జాబులు సాధించాడు మంగళవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమణారెడ్డి కార్యదర్శిని శాలువాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో 9 జాబులు సాధించడం అభినందనీయమని ఇతను అన్నారుమెదక్ జిల్లా లోని ఫరీద్ పుర్ తండాకు చెందిన శ్రీనివాస్ ఇప్పటి వరకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తొమ్మిది వరకు సాధించడం జరిగింది ఆర్టీసీ ,హెచ్ఎం డబ్ల్యూ ఎస్ లలో జూనియర్ అకౌంటెంట్, ఎఫ్సీఐ , బిఎస్ఎన్ఎల్ ల లో జే ఓ ఏగా గురుకుల జూనియర్ లెక్చరర్ మునిసిపాలిటీ లో సీనియర్ అకౌంటెంట్ మొదలైన ఉద్యోగులు సాధించారు ఈ కార్యక్రమంలో యాసతిరుపతి, ఎలుకస్వామి, అల్లేపు రజినీకాంత్, మామిడిరాజు, బిగుల్ల విజయ్, న్యాతఅశోక్ తదితరులు పాల్గొన్నారు…
ఏకకాలంలో తొమ్మిది కొలువులు..
- Advertisment -