Tuesday, November 3, 2026

ఇల్లంతకుంట మండలంలో కుల సంఘాలకు వల

ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివిధ కుల సంఘాలను మండలబీఆర్ఎస్ నాయకులు కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని తమ పార్టీని గెలిపించాలని నాయకులు కుల సంఘాలను కోరుతున్నారు. గురువారం  ఇల్లంతకుంట గౌడ కుల సంఘాన్ని గౌడ సంఘ భవనంలో సమావేశపరిచి కారు గుర్తుకు ఓటు వేయాలని, రసమయి బాలకిషన్ ను గెలిపించాలని ఇల్లంతకుంట మండల జడ్పిటిసి సిద్ధం వేణు కోరారు. గీతా కార్మికులకు తమ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని, గౌడ కులస్తులకు 50 సంవత్సరములకే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.అనేక సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇంకా అభివృద్ధి జరగాలంటే రసమయి బాలకిషన్ కు ఓటు వేస గెలిపించాలని ఆయన కోరారు. వారం రోజుల నుండి మండల కేంద్రంలోని వివిధ కుల సంఘాలను కలుస్తూ తమ పార్టీకి ఓటు వేయాల్సిందిగా బి ఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య యాదవ్, సర్పంచ్ కూనబోయిని భాగ్యలక్ష్మి, బాలరాజు ఉపసర్పంచ్ ఎండి సాదుల్, ఇల్లంతకుంట ఫాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, మాజీ ఎంపీటీసీ కే భాస్కర్, ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page