ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివిధ కుల సంఘాలను మండలబీఆర్ఎస్ నాయకులు కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని తమ పార్టీని గెలిపించాలని నాయకులు కుల సంఘాలను కోరుతున్నారు. గురువారం ఇల్లంతకుంట గౌడ కుల సంఘాన్ని గౌడ సంఘ భవనంలో సమావేశపరిచి కారు గుర్తుకు ఓటు వేయాలని, రసమయి బాలకిషన్ ను గెలిపించాలని ఇల్లంతకుంట మండల జడ్పిటిసి సిద్ధం వేణు కోరారు. గీతా కార్మికులకు తమ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని, గౌడ కులస్తులకు 50 సంవత్సరములకే వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.అనేక సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇంకా అభివృద్ధి జరగాలంటే రసమయి బాలకిషన్ కు ఓటు వేస గెలిపించాలని ఆయన కోరారు. వారం రోజుల నుండి మండల కేంద్రంలోని వివిధ కుల సంఘాలను కలుస్తూ తమ పార్టీకి ఓటు వేయాల్సిందిగా బి ఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. ఇల్లంతకుంట ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య యాదవ్, సర్పంచ్ కూనబోయిని భాగ్యలక్ష్మి, బాలరాజు ఉపసర్పంచ్ ఎండి సాదుల్, ఇల్లంతకుంట ఫాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, మాజీ ఎంపీటీసీ కే భాస్కర్, ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండలంలో కుల సంఘాలకు వల
- Advertisment -