Mumbai : విమానంలో ప్రయాణించే ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. పూణె నుంచి ఢిల్లీకి శనివారం బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు ‘నా బ్యాగులో బాంబు ఉంది’ అని బెదిరించాడు. దీంతో ఈ విషయం అధికారులకు అందగానే దానిని దానిని ముంబయ్ లో ల్యాండ్ చేశారు. ఆ తరువాత బాంబుస్వ్కాడ్ కు సమాచారం అందడంతో పోలీసులతో సహా ఎయిర్ పోర్టుకు చేరుకొని ప్రయాణికుడి బ్యాగును పరిశీలించారు. అయితే ఉందులో ఎలాంటి బాంబు లభించలేదు. ఆ తరువాత ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇందులో 185 మంది ప్రయాణం చేస్తున్నారు.
Mumbai : బ్యాగులో బాంబు ఉందని బెదిరింపు.. విమానం అత్యవసర ల్యాండింగ్..
- Advertisment -