Mlc Kavitha : హైదరాబాద్, జనతా న్యూస్ : డన్ లోని ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత సోమవారం ప్రసంగం చేయనున్నారు. ఇందుకోసం ఆమె ఆదివారం రాత్రి బ్రిటన్ కు వెళ్లారు. ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ ది తెలంగాణ మోడల్’ అనే అంశంలో కవిత ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈమేరకు కవితకు ఆహ్వానం దక్కడంతో ఆమెను పలువురు అభినందించనున్నారు. బ్రిటన్ బయలు దేరే ముందు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘనంగా వీడ్కోలు తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, తదితర అంశాలపై కవిత ప్రసంగిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిపై మట్లాడనున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత.. ఇప్పుడు ప్రముఖ యూనివర్సిటీ నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడంపై కవితను అభినందిస్తున్నారు.
Mlc Kavitha : నేడు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత ప్రసంగం
- Advertisment -