జనత న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండలాన్ని, హుస్నాబాద్ నియోజకవర్గంను కరీంనగర్ జిల్లాలో కలపాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి నాయకులు సొల్లు అజయ్ వర్మ మండల ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరుతున్నట్లు తెలిపారు. బెజ్జంకి మండల ప్రజలు సిద్దిపేట జిల్లాకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను సిద్దిపేట జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు మంత్రి హరీష్ రావు స్వార్థం కోసం సిద్దిపేట జిల్లాలో కలుపుకోవడం జరిగింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రభుత్వం కరీంనగర్ లో కలపాలని కోరారు.
బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపండి
- Advertisment -