Tuesday, November 3, 2026

మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ నామినేషన్

మంథని,  జనతా న్యూస్: మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్‌ పత్రాలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మూడోసారి, మామూలు కుటుంబంలో పుట్టిన బీసీబిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని అన్నారు. మంథని నియోజకవర్గం అభివృధ్దిలో పరుగులుపెట్టాలంటే ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇప్పటికే తాను ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృధ్దితో పాటు తన తల్లిపేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించానన్నారు. సంక్షేమ, అభివృద్ది, సేవ నా ప్రధాన ఏజేండాలని ఆయన అన్నారు.  నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృధ్దిని పేదోళ్లకు తనవంతుగా సేవ చేసి చూపించానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లకు అవకాశం ఇస్తె ఎలా అభివృధ్ది చేస్తారో మీరే చూశారని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కనబడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సభ సక్సెస్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి మరువలేనిదని, సమిష్టిగా ప్రజలను తరలించడంలో ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు.నియోజకవర్గ ప్రజలు సైతం బీసీ బిడ్డను కాపాడుకోవాలని బారీగా తరలివచ్చి ఒక మంచి సందేశం ఇచ్చారని, అంచనాకు మించి ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page