Wednesday, October 28, 2026

శ్రీశైలంలో కుంభోత్సవం ప్రారంభం

ShriShailam: ప్రముఖశైవక్షేత్రం శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భ్రమరాంబ దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని నిమ్మకాయతో అలంకరించారు. అనంరం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర, శతనామ కుంకుమార్చన నిర్వహించారు. ఆ తర్వాత కొబ్బరి, గుమ్మడి కాయలను బలిగా  సమర్పించారు. ఇదే సమయంలో హరిహర రాయ గోపురం వద్ద మహిషాసుర అవతారంలో ఉన్న  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం కుంభోత్సవం కీలక ఘట్టం నిర్వహించనున్నారు.  అమ్మవారి ఆలయ శిల్ప మండపం వద్ద అన్నాన్ని రాసిగా పోస్తారు.  పూజలు అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం స్త్రీ  వేషధారణలో ఆలయ అర్చకుడు  భ్రమరాంబ దేవికి  హారతి సమర్పిస్తారు. ఆ తర్వాత రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరి, గుమ్మడి కాయలను సాత్విక బలిగా ఇస్తారు. భ్రమరాంబ దేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియలు నిర్వహిస్తారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page