ShriShailam: ప్రముఖశైవక్షేత్రం శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భ్రమరాంబ దేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని నిమ్మకాయతో అలంకరించారు. అనంరం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర, శతనామ కుంకుమార్చన నిర్వహించారు. ఆ తర్వాత కొబ్బరి, గుమ్మడి కాయలను బలిగా సమర్పించారు. ఇదే సమయంలో హరిహర రాయ గోపురం వద్ద మహిషాసుర అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం కుంభోత్సవం కీలక ఘట్టం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయ శిల్ప మండపం వద్ద అన్నాన్ని రాసిగా పోస్తారు. పూజలు అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం స్త్రీ వేషధారణలో ఆలయ అర్చకుడు భ్రమరాంబ దేవికి హారతి సమర్పిస్తారు. ఆ తర్వాత రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరి, గుమ్మడి కాయలను సాత్విక బలిగా ఇస్తారు. భ్రమరాంబ దేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియలు నిర్వహిస్తారు.
శ్రీశైలంలో కుంభోత్సవం ప్రారంభం
- Advertisment -