హైదరాబాద్, జనతాన్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ లోని నివాసం ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల నివాసంలో శనివారం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. అటు కేజ్రీవాల్ బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అయితే కవిత భర్తకు ఇప్పటికే ఈడి నోటీసులు అందించింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Kavitha : కవిత భర్త బంధువు ఇంట్లోసోదాలు
- Advertisment -