Sunday, October 25, 2026

కాత్యాయని దేవి ( శ్రీ మహాలక్ష్మి దేవి)గా అమ్మవారి దర్శనం

మహాశక్తి ఆలయంలో..
వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
నాణేలు, తామర పువ్వులతో ప్రత్యేక అలంకరణ
దర్శించుకున్న జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌..


కరీంనగర్‌-జనత న్యూస్‌
కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం కాత్యాయని ( శ్రీ మహాలక్ష్మి) దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను ప్రత్యేకంగా నాణేలు, తామర పువ్వులతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పేయి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. కాగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బిజిబిజీగా గడిపారు. మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగిసాక ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.అనంతరం భవానీ భక్తులతో కలిసి బిక్ష చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page