Sunday, November 1, 2026

కరీంనగర్: సనాతన ధర్మం తరగతులను సద్వినియోగం చేసుకోండి..

కరీంనగర్, జనతా న్యూస్: భారతదేశంలో అతి పురాతన, పవిత్ర గ్రంథాలు.. వేదాలు ఉన్నాయి. ఇవి మనుషుల జీవితాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా మనిషి యొక్క ఆలోచనా విధానాన్ని సక్రమ మార్గంలో ఉంచుతూ గొప్ప అంశాలను చూపిస్తాయి. ఇవి నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక సాధనలను ప్రోత్సహిస్తూ.. ఆత్మ శుద్ధి చేయడానికి ఉపయోగపడే సనాతన ధర్మం గురించి చెప్పేవారు నేటి కాలంలో కరువయ్యారు. దీంతో ధర్మం దూరమై సమాజం కలుషితంగా మారుతోంది.  ఇలాంటి సమయంలో కరీంనగర్ లోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రీలత సనాతన ధర్మం గురించి ప్రచారం చేయాలని సంకల్పించారు.ఇందులో భాగంగా ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి భగవద్గీత, రామాయణం వంటి ఆధ్యాత్మిక విషయాలను విద్యార్థులకు చెప్పిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో డాక్టర్ శ్రీలత నేరుగా సనాతన ధర్మం గురించి తరగతుల్లో పాల్గొంటున్నారు. అలాగే కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉండి.. ప్రస్తుతం కరీంనగర్ లోని నివాస ముంటున్న బీవీ రావు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక విషయాలపై ప్రచారం చేయడం ద్వారా మనుషుల జీవితాలు చక్కబడుతాయని వారు భావిస్తున్నారు.

సనాతన ధర్మంపై ప్రతీ ఆదివారం కరీంనగర్ పట్టణంలోని వావిలాపల్లి రామాలయం, సప్తగిరి కాలనీలోని కోదండ రామాలయం, మాతా మాణికేశ్వరి దేవాలయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.  ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే ఈ క్లాసుల్లో ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక విషయాపై వివరించనున్నారు.

అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను సనాతన ధర్మం తరగతులకు తప్పకుండా పంపించాలని డాక్టర్ శ్రీలత పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 79,81958763, 94400042331, 9966575171, 9848928482, 9701996543 అనే నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

సనాతన ధర్మం తరగతులు..

 

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page