కరీంనగర్, జనతా న్యూస్: భారతదేశంలో అతి పురాతన, పవిత్ర గ్రంథాలు.. వేదాలు ఉన్నాయి. ఇవి మనుషుల జీవితాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా మనిషి యొక్క ఆలోచనా విధానాన్ని సక్రమ మార్గంలో ఉంచుతూ గొప్ప అంశాలను చూపిస్తాయి. ఇవి నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక సాధనలను ప్రోత్సహిస్తూ.. ఆత్మ శుద్ధి చేయడానికి ఉపయోగపడే సనాతన ధర్మం గురించి చెప్పేవారు నేటి కాలంలో కరువయ్యారు. దీంతో ధర్మం దూరమై సమాజం కలుషితంగా మారుతోంది. ఇలాంటి సమయంలో కరీంనగర్ లోని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రీలత సనాతన ధర్మం గురించి ప్రచారం చేయాలని సంకల్పించారు.ఇందులో భాగంగా ఆమె ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి భగవద్గీత, రామాయణం వంటి ఆధ్యాత్మిక విషయాలను విద్యార్థులకు చెప్పిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో డాక్టర్ శ్రీలత నేరుగా సనాతన ధర్మం గురించి తరగతుల్లో పాల్గొంటున్నారు. అలాగే కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉండి.. ప్రస్తుతం కరీంనగర్ లోని నివాస ముంటున్న బీవీ రావు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఆధ్యాత్మిక విషయాలపై ప్రచారం చేయడం ద్వారా మనుషుల జీవితాలు చక్కబడుతాయని వారు భావిస్తున్నారు.
సనాతన ధర్మంపై ప్రతీ ఆదివారం కరీంనగర్ పట్టణంలోని వావిలాపల్లి రామాలయం, సప్తగిరి కాలనీలోని కోదండ రామాలయం, మాతా మాణికేశ్వరి దేవాలయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే ఈ క్లాసుల్లో ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక విషయాపై వివరించనున్నారు.
అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను సనాతన ధర్మం తరగతులకు తప్పకుండా పంపించాలని డాక్టర్ శ్రీలత పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 79,81958763, 94400042331, 9966575171, 9848928482, 9701996543 అనే నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
సనాతన ధర్మం తరగతులు..