Sunday, November 1, 2026

ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ సీపీ ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ క్రైమ్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయడంతో పాటు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు.

అనంతరం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గల స్టాటిక్ సర్వేలెన్సు టీం ఆధ్వర్యంలో గల చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అక్రమ తరలింపులను గుర్తించినట్లయితే సీజ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కరుణాకర్ రావు, తిమ్మాపూర్ ఇన్స్పెక్టర్, ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page