Licenced Arms:కరీంనగర్, జనతా న్యూస్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా లైసెన్స్ కలిగిన ఆయుధాలు పోలీస్ స్టేషన్ కు చేరుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 263 లైసెన్స్ ఆయుధాలు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగతంగా వినియోగిస్తున్న 201 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. మిగతా 62 ఆయుధాలను వివిధ బ్యాంకులు, ప్రభుత్వం భద్రత కోసం వినియోగిస్తున్నారు. అప్పగించిన ఆయుధాలను లైసెన్స్ దారులు జూన్ 7న తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ఎన్నికల నోటిఫికేషన్ నాటికి లైసెన్స్ కలిగిన ఆయుధాలను అప్పగించాలని పోలీస్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆ లోపే పోలీస్ శాఖ నుంచి వెళ్లిన సమాచారం మేరకు లైసెన్స్ దారులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఆయుధాలను అప్పగించారు. కరీంనగర్ జిల్లాలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు 114 ఉండగా ఇప్పటి వరకు 8 9 పోలీసులకు అప్పగించారు. పెద్దపెల్లి జిల్లాలో 61 లైసెన్సు కలిగిన ఆయుధాలు ఉండగా 44.. జగిత్యాల జిల్లాలో 56 ఉండగా 45.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 32 ఆయుధాలు ండగా 23 పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. వ్యక్తిగత భద్రత కోసం లైసెన్స్ తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలు ఉమ్మడి జిల్లా వాసులు పోలీస్ స్టేషన్లలో అప్పగిస్తున్నారు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఆయుధాలను అప్పగించాల్సి ఉంటుంది.