Monday, October 26, 2026

‘జనత న్యూస్‌’ ఎఫెక్ట్‌ !

ఈ నెల 15న రీజినల్‌ పేజీలో కథనం
పీఎంపీ, ఆర్‌ఎంపీ లకు ..
శిక్షణ, సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వం అంగీకారం ?
అసోసియేషన్‌ ప్రతినిధుల పాలాభిషేకం..

కరీంనగర్‌- జనత న్యూస్‌

జనత న్యూస్‌ కథనానికి ప్రభుత్వం నుండి కదలిక వచ్చింది. ఈ నెల 15న జనత రీజినల్‌ పేజీలో ‘ దాడులు..వెనక్కి’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన పీఎంపీ, ఆర్‌ఎంపీ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక వచ్చారు. దీంతో వారికి శిక్షణ, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రతినిధులు కరీంనగర్‌లో ఈ విషయాన్ని వెల్లడిరచారు. ప్రభుత్వానికి కృతజ్ఞతగా నగరంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం సీఎం, మంత్రి పొన్నం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. పీఎంపీ, ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రత్నం, నగర అధ్యక్షులు గణేశ్‌ తెలిపారు. ఎంబీబీఎస్‌, ఎండీ డాక్టర్లకు వ్యతిరేకం కాదని..తమ పరిధిలో రోగులకు ప్రథమ చికిత్స అందిస్తామని వారు స్ఫష్టం చేశారు.
కాగా..‘‘పీఎంపీ, ఆర్‌ఎంపీ లపై చర్యలకు వెనకడుగు..ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిళ్లు..ట్రీట్‌మెంట్‌, విధి విధానాలపై స్ఫష్టత కరువు’’ ఈ అంశాలపై సమగ్ర కథనం జనత న్యూస్‌ పత్రికలో ప్రచురితం అయిన విషయం తెలిసిందే. దీనిపై పీఎంపీలు, ఆర్‌ఎంపీల్లో విస్తృత చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ పెద్దల సాకారాంతో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి అసోసియేషన్‌ ప్రతినిధులు తీసుకెల్లినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుండి ఇందుకు సంబంధించిన విధి విధానాలు రావాల్సి ఉంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page