Monday, October 26, 2026

జడ్పీలో ప్రశ్నిస్తే.. కేసు నమోదు చేస్తారా..?

చరిత్రలో ఎప్పుడూ చూడలే !
జడ్పీ సీఈవో పెట్టిన కేసును ఎత్తివేయాలి
ఎమ్మెల్యే కౌశిక్‌తో కలసి సీపీకి మాజీ మంత్రి గంగుల ఫిర్యాదు
కరీంనగర్‌`జనత న్యూస్‌
సమస్యలపై ప్రశ్నిస్తే ఎలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌. అకారణంగా తమ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌లో సీపీ అభిషేక్‌ మహంతిని కలసి జడ్పీ సీఈవో శ్రీనివాస్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి ఫిర్యాదు చేశారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్‌ జిల్లాలో మాత్రమే ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం దురదృష్టకరమన్నారు. జడ్పీ, అసెంబ్లీ వేదికలున్నదే ప్రశ్నించేందుకని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై నిలదీసిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై నమోదైన తప్పుడు కేసును ఉప సంహరించుకోవాలని కోరారు. అందరినీ సమాన దృష్టిలో చూస్తామని సీఎం రేవంత్‌ చెప్పిన మూడు రోజులకే ఇలా కక్ష సాధింపు చర్యలకు ఎలా పాల్పడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులపై కక్ష్య పూరిత చర్యలు జరుగకుండా చూడాలని సీఎంకు సూచించారు ఎమ్మెల్యే గంగుల. దళిత బంధు పెండిరగ్‌ నిధుల విడుదల, పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని మాత్రమే కోరానని..తనపై జడ్పీ సీఈవో శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ చేశారని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ చేస్తే, తనను మాట్లడకుండా అడ్డుకున్న సీఈవో శ్రీనివాస్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సీపీని కోరారు. కరీంనగర్‌ డీఈవో, సీఈవో లపై అసెంబ్లీ స్పీకర్‌ ద్వారా ప్రివిలేజ్‌ మోషన్‌ మూవ్‌ చేయిస్తానని తెలిపారు. వారి వెంటన మాజీ మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌, నాయకులు ఉన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page