Sunday, October 25, 2026

మాతా శిశు ఆసుపత్రిలో..

అందుబాటులోకి మరో వంద పడకలు
ఆసుపత్రి ప్రాథమిక అవసరాలు తీర్చాలి
అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు

కరీంనగర్‌-జనత న్యూస్‌
కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆన్నారు. కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం సోమవారం ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరై మాట్లాడారు. ఆస్పత్రిలో ప్రాథమిక అవసరాలను వెంటనే తీర్చాలని, మాతా శిశు కేంద్రంలో మరో వంద పడకలు అందుబాటులోకి తేవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. ఆసుపత్రిలో సుమారు 150 ఏసీలు, పరికరాలు అవసరం ఉన్నాయని సూపరింటెండెంట్‌ కోరగా, ఏసీల ఏర్పాటు బాధ్యత తాను చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, పాడైపోయిన అంబులెన్స్‌ ల స్థానంలో రెండు కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలుకు కొన్ని నిధులు ఉన్నాయని ఇంకా రూ.9 లక్షలు అవసరమని సూపరింటెండెంట్‌ తెలుపగా ఆ నిధులు జిల్లా కలెక్టర్‌ సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. రోగులకు ఆర్‌ ఓ వాటర్‌ అందించాలని తెలిపారు. ఆస్పత్రిలో ఖాళీల వివరాలు సమర్పిస్తే భర్తీ కోసం తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆస్పత్రి అభివృద్ధికి అందరూ కలిసి రావాలని, ఎవరైనా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వవచ్చని కోరారు. ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ట్రైనీ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పెయి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page