Thursday, September 19, 2024

హర్యానా ఎన్నికల వాయిదాకు బీజేపీ వినతి

జనత డెస్క్‌ :
హర్యానా రాష్ట్ర ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ జమ్మూ-కశ్మీర్‌, హర్యానా..రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1న హర్యానా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.అయితే..తాజాగా హర్యానా బీజేపీ యూనిట్‌ ఎన్నికల వాయిదా కోరుతూ..ఆ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను అభ్యర్థించింది. బీజేపీ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫార్వర్డ్‌ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. వరుస సెలవుల నేపథ్యంలో పోలింగ్‌ తక్కువయ్యే అవకాశాలున్నట్లు కారణాలు చెబుతోంది బీజేపీ..కాంగ్రెస్‌ మాత్రం బీజేపీ వినతిని వ్యతిరేకిస్తుంది. ఓటమి భయంతో ఎన్నికల వాయిదా కోరుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. బీజేపీ యూనిట్‌ అభ్యర్థనను కేంద్ర ఎన్నికల కమీషన్‌ కన్సిడర్‌ చేస్తుందా..లేక యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించాల్సి ఉంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page