Tuesday, October 27, 2026

Harish Rao: రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనపడుతోంది: హరీష్ రావు

Harish Rao: కరీంనగర్, జనతా న్యూస్: రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం కనపడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన కరీంనగర్ లో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ  పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన్ని దింపేస్తారన్న భయం వెంటాడుతోందన్నారు. ఆరు గ్యారెంటీ ల గురించి ,పాలన గురించి రేవంత్ మాట్లాడటం లేదని, అయితే తిట్టు… లేదంటే ఒట్టు … ఇదే రేవంత్ సీఎం అయ్యాక చేస్తున్న పని అని విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. బీజేపీ తో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని అన్నారు. బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారని, రేవంత్ కి అయితే అతి తెలివి ,లేదంటే మతిమరుపు అని అన్నారు.  కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లిం ల ఆస్తులకి ఇబ్బందులు ఉండవని, రేవంత్ వచ్చాక ధరల పై అదుపు లేకుండా పోయిందని అన్నారు. పప్పు ,నూనె ధరలు ,సిమెంట్ ధరలు ఇలా అన్ని రంగాల్లో ధరలు పెరిగిపోయాయని అన్నారు. అటు కేంద్రం లో బీజేపీ అలానే ఉందని, ఇటు రాష్ట్రం లో కాంగ్రెస్ లోనూ అలానే ఉందని చెప్పారు. బీసీ లపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీ లకి అత్యధిక టికెట్ లు ఇచ్చింది బిఆర్ఎస్ నే అని అన్నారు.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page