గన్నేరువరం,జనతా న్యూస్: కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండలంలో దూసుకుపోతుంది. ఇక్కడి నాయకులు ప్రజల్లోకి చొచ్చుకుపోతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మండల నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు సునీల్, సాంబయ్యపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, కూన కొమరయ్య, పర్షరామ్,విజేందర్, రాజిరెడ్డి, రంగనవేని అజయ్,శేకర్,నవీన్, శ్రీమాన్, పాల్గొన్నారు
ప్రచారంలో దూసుకుపోతున్న గన్నేరువరం కాంగ్రెస్
- Advertisment -