Tuesday, October 27, 2026

Gropup 2 : గ్రూప్ 2 పరీక్షలు వాయిదాలకు కారణం ఇదే..

Gropup 2 : తెలంగాణ నిరుద్యోగులు మరోసారి నిరాశ చెందాల్సిన సమయం వచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 పరీక్షలుమరోసారి వాయిదా పడ్డాయి. గతంలో వరుస పరీక్షలు ఉన్న  నేపథ్యంలో వాయిదా పడగా… తాజాగా ఎన్నికల రూపంలో నిరుద్యోగులు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రూప్ 2 పరీక్షల కోసం గతేడాది టీఎస్ పీఎస్ సీ 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా ఈ 2023 ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వచ్చింది. దీంతో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

అయితే తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో   కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంగళవారం టీఎస్ పీఎస్ సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కారణంగా పోలీస్ బందోబస్తు వాటి నిర్వహణకే ఉంటుంది. దీంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించారు. దీంతో వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఎస్ పీఎస్ సీ ప్రకటన వెలువరించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page