Gropup 2 : తెలంగాణ నిరుద్యోగులు మరోసారి నిరాశ చెందాల్సిన సమయం వచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 పరీక్షలుమరోసారి వాయిదా పడ్డాయి. గతంలో వరుస పరీక్షలు ఉన్న నేపథ్యంలో వాయిదా పడగా… తాజాగా ఎన్నికల రూపంలో నిరుద్యోగులు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రూప్ 2 పరీక్షల కోసం గతేడాది టీఎస్ పీఎస్ సీ 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా ఈ 2023 ఆగస్టు 29,30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వచ్చింది. దీంతో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
అయితే తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో కారణంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంగళవారం టీఎస్ పీఎస్ సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కారణంగా పోలీస్ బందోబస్తు వాటి నిర్వహణకే ఉంటుంది. దీంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించారు. దీంతో వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీఎస్ పీఎస్ సీ ప్రకటన వెలువరించింది.