Sunday, October 25, 2026

కొన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేసే అవకాశం కల్పించండి: వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, జనతా న్యూస్: నిత్యం మీకు అందుబాటులో ఉండే మంత్రి ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ మాదిరిగా నేను కూడా   నా కొన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తానని, అందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రాావు అన్నారు. శనివారం ఆయన కోడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నా జన్మభూమిలో కాలు పెడితే మనసు పులకించిపోతుందని అన్నారు.  మా నాన్న చనిపోయే ముందు నా దగ్గర కరీంనగర్ ప్రజలకు సేవ చేయాలని ఒట్టు వేయించుకున్నారని చెప్పారు.   జగపతిరావు తనయుడుగా నేను మీ అందరికీ సుపరిచితుడుని,  నన్ను గెలిపిస్తే కరీంనగర్ కు ఎంపీ లాడ్స్ నిధులతో పాటు విద్యార్థుల కోసం ఐఐటి, నవోదయ, సైనిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, యువత ఉపాధి కోసం టెక్స్ టైల్స్, సామాన్యుల కోసం రైల్వే లైన్ అభివృద్ధి తదితర కార్యక్రమంలో మీ ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం 4 నెలలలోపే ఎన్నికల హామీలను అమలు చేసి అన్ని రాష్ట్రాల చూపు మన వైపు తిప్పుకునేలా చేసిందన్నారు.  ఎన్నికల కోడ్ ముగియగానే నిలిచిపోయిన మరో పథకంతో పాటు రెండు లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు 2500 డబ్బులు, వర్షాకాలంలో 500 బోనస్, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు తదితర కార్యక్రమాలను కచ్చితంగా చేసి తీరుతుందని చెప్పారు. దేవుడిని అడ్డం పెట్టుకోని ఓట్లు దండుకోవాలని చూసే బిజెపి.. కరీంనగర్ కంటే వరంగల్ జిల్లా మీద ఎక్కువ మక్కువ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page