కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రజలను కోరారు.మంగళవారం నగరంలోని 22వ డివిజన నిర్వహించిన స్త్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకమై ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్న తన నాన్న చెప్పిన మాటకు కట్టుబడి సేవ చేసి అయన మాటను నిలుపుకోవాలననే ఉద్దేశంతోనే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు.ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా తన సొంత నిధులకు పనులతోనూ ప్రజాప్రయోజకర పనులు చేయాలనే సంకల్పం ఉందన్నారు. ఏ విధమైన పనులు చేయాలనే విషయమే తనకు స్పష్టమైన అవగాహన ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేయడం ద్వారా ఎంపీగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.ఈ సమావేశంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె పద్మాకర్ రెడ్డి,డివిజన్ నాయకులు గంట శ్రీనివాస్ కళ్యాణి, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సేవ చేసే అవకాశం ఇవ్వండి: వెలిచాల రాజేందర్ రావు
- Advertisment -