అధికారులకు కలెక్టర్ మనుచౌదరి ఆదేశం
హుస్నాబాద్, మార్చి 13 ( మానేరు జనతా ):రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనుల పురోగతని పరిశిలించారు. ఈ సందర్బంగా అధికారులు ప్రాజెక్టు డిఇ లు ప్రశాంత్, కరుణ శ్రీ లు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం, జరుగుతున్న పనుల వివరాలతో పాటు నిర్మించాల్సిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణ గురించి కలెక్టర్ మనుచౌదరికి వివరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినందున కాలువల నిర్మాణానికి భూసేకరణ పనులను వేగవంతం చేసి కాలువల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.