Game Changer: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించిన ఓ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ బిగ్ డైరెక్టర్ శంకర్ సమక్షంలో పనిచేస్తున్నారు. గేమ్ ఛేంజర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలాకాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమాలోని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి జరగండి’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ ఈ సాంగ్ ను రచించగా.. డాలర్ మొహంది, సునీత చౌహన్ పాడారు. ఆ సాంగ్ ను మీరు కూడా చూసేయండి…
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి.. జరగండి..’
- Advertisment -