Monday, October 26, 2026

మహిళల ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, జనతా న్యూస్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.శనివారం రాష్ట్ర,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎన్.ఏ.సి ను సందర్శించి మహిళలకు రెండవ బ్యాచ్ కుట్లు, అల్లికల శిక్షణను ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుట్లు, అల్లికలను సంపూర్ణంగా నేర్చుకోవాలని, వివిధ డిజైన్లలో మహిళల దుస్తులుకుట్టడం, డిజైన్లు రూపొందించడం నేర్చుకుంటే గణనీయంగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

ప్రతి బ్యాచ్ లో శిక్షణకు వచ్చే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తున్నామని, మహిళలు శిక్షణను సంపూర్ణంగా వినియోగించుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆదాయం అర్జించాలని అన్నారు. మంచి టెయిలరింగ్ నైపుణ్యం ఉన్న వారికి మార్కెట్ లో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.మంథని ఎన్.ఏ.సి లో శిక్షణ పొందే మహిళలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని, మహిళల అభ్యర్థన మేరకు వెంటనే స్టాండింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఏ.సి ఇంచార్జి బి.రజిత, మహిళలు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page