వరంగల్: గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అంత్యక్రియలు వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో శనివారం ఉదయం పూర్తయ్యాయి. కన్నవారితో పాటు ఊరంతా కన్నీటి పర్యంతమయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక పోటీ పరీక్సల కోసం అశోక్ నగరంలో ఉంటూ గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. తాజాగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురై శుక్రవారం సాయంత్ర హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ప్రవళిక అంత్యక్రియలు పోలీసు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు.
భారీ బందోబస్తు మధ్య ప్రవళిక అంత్యక్రియలు
- Advertisment -