ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల సభలో భద్రత వైఫల్యం పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)కి ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను త్వరగా విచారించి నివేదిక ఇవ్వాలని సీఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ను ఆదేశించింది. రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలు వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నమోదు చేశారు. రాజకీయ హింసాత్మక ఘటనలపై తక్షణం ఈసీఐకి నివేదిక పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదని లక్ష్యంతో పనిచేస్తున్నామని, కోడ్ వచ్చిన మనసటి రోజే హింసాత్మక ఘటన జరగడం ఈసీఐ తీవ్ర అగ్రహానికి గురిచేసిందని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఈసీఐ ఎప్పటికప్పుడు గమనిస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ప్రజాగళం సభలో మోడీ మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలను సౌండ్ సిస్టం వద్దకు వచ్చి నా వారిని పోలీసులు నియంత్రించలేదని టిడిపి నేతలు ఆరోపించారు.
ప్రధాని సభలో ఆటంకాలపై వివరణ కోరిన ఈసీఐ
- Advertisment -