Monday, October 26, 2026

ఇంటి నుండే ఈ-ఎఫ్‌ఐఆర్‌..

మహిళలపై నేరాలు క్షమించరానివి..
కోల్‌కత్తా, ఇతర ఘటన లపై ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యలు
మహారాష్ట్ర :
కోల్‌ కత్తా ఘటన, ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పందించారు. బాధిత కుటుంబాలతో పాటు మహిళల్లో భరోసా నింపేలా పలు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర జల్గావ్‌లో జరిగిన లఖ్‌పతి దీదీ సమ్మెళన్‌ కార్యక్రమానికి హాజరైన ప్రధాని..స్థానిక మహిళ లతో సంభాషించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక నుండి బాధిత మహిళలు ఇంటి నుండే ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకోవచ్చని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలో పొందు పర్చామన్నారు. కోల్‌ కత్తా లో జరిగిన హాత్యాచార ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అక్కడి ప్రభుత్వం ఆలస్యం చేసిందని సుప్రిం కోర్టు చెప్పిన విషయాలను గుర్తు చేశారు ప్రధాన మంత్రి మోది. మహిళలపై జరిగే నేరాలు క్షమించ రానివని..నేరాలకు పాల్పడే వారెంతటి వారైనా వదిలి పెట్టకూడదని, వారికి సాయం చేసిన వారినీ వదలొద్దని..ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. ‘‘ఆసుపత్రి, పాఠశాల, కార్యాలయం, ఇతర ఏ సంస్థలో అయినా నిర్లక్ష్యంగా ఉంటే చర్య తీసుకోవాలి’’ అని ప్రభుత్వాలను ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page