Wednesday, October 28, 2026

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

తిమ్మాపూర్, జనతా న్యూస్:  నకొండూర్ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మంచినీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్య నివారణకు రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనిమిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా త్రాగు నీటి విషయంలో సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరిగేందుకు, నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ (ఇంట్రా ) కార్యనిర్వాహక ఇంజినీర్ అంజన్ రావు, ఉప ఇంజినీర్ సూర్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page