Sunday, October 25, 2026

శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే..

ఏ పార్టీవారినైనా వదలం !
పరిపాలన కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
17, 18 లలో రాజకీయ విద్వేష ప్రకటనలొద్దు
ప్రతిపక్షాలకు రాష్ట్ర మంత్రి పొన్నం వినతి
కరీంనగర్‌-జనత న్యూస్‌
శాంతి భద్రతలకు భంగం కల్గిస్తే ఏ పార్టీ నేతనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండల కేంద్రంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా బీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని..హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే పోలీస్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని, 17,18 వ తేది వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయడానికి వీలు లేదని ప్రతిపక్ష పార్టీల నేతలకు సూచించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు 10 నెలలోనే అసహనానికి గురై ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై మంత్రి పొన్నం మండి పడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశం హైకోర్టు లో ఉందని, అది శాసన సభ చూసుకుంటుందన్న ఆయన..రాజకీయ విమర్శలు చేసి కొట్లాడుకోవాలనుకుంటే వినాయక నిమజ్జనం తరువాత చూసుకోండని హితవు చెప్పారు. పరిపాలన చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page