బెజ్జంకి, సెప్టెంబర్ 24 (జనతా న్యూస్): గన్నేరువరం మండలం జంగాపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జంగాపల్లి సర్పంచ్ తాడూరి కర్ణ–శ్రీ వెంకట రమణారెడ్డి కుమార్తె మన్విత రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, మహిళా నాయకులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



