Monday, October 26, 2026

విద్యా సంస్థల్లో కాన్షియస్‌ క్లబ్‌లు

డ్రగ్స్‌, గంజాయి నియత్రణకు చర్యలు
వివరాలు తెలిస్తే 8019263862, 8712671111..
నెంబర్లకు ఫోన్‌ చేయండి : కలెక్టర్‌

కరీంనగర్‌-జనత న్యూస్‌
అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్స్‌, గంజాయి నియంత్రణకు కాన్షియస్ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో డ్రగ్స్‌ నియంత్రణపై ఎక్సైజ్‌, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..యువత డ్రగ్స్‌, ఆల్కహాల్‌, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వీటి భారిన విద్యార్థులు పడకుండా అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో కాన్షియస్‌ క్లబ్‌ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి క్లబ్‌ లో ఇద్దరు ఉపాధ్యాయులు, వాలంటీర్లు, విద్యార్థులు ఉంటారని పేర్కొన్నారు. వీరంతా చెడు వ్యసనాల బారిన పడకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని వివరించారు. జులై నెల ఆఖరి వరకు అన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లలో కాన్సియస్‌ క్లబ్‌ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌ రెడ్డి డ్రగ్స్‌ మాఫియా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. డ్రగ్స్‌, గంజాయి కొనుగోలు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులకు నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. వీటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆమె సూచించారు. జిల్లాలో డ్రగ్స్‌, గంజాయిని ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా.. వారి సమాచారం ఇవ్వాలని కోరారు. ఏమైనా వివరాలు తెలిస్తే కరీంనగర్‌ లోని కంట్రోల్‌ రూమ్‌ 8019263862, టీజీఎన్‌ ఏబీ నంబర్‌ 8712671111 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యాసంస్థల్లో ఏర్పాటు చేయనున్న కాన్షియస్‌ క్లబ్‌లకు సంబంధించిన పోస్టర్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి సుజాత, సంక్షేమ అధికారి సరస్వతి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page