Congress: జాతీయ కాంగ్రెస్ కు ఐటీ విభాగం భారీ షాక్ ఇచ్చింది. తాజాగా ఆదాయపు పన్ను అంశంలో నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెనాల్టీ, వడ్డీకి సంబంధించి రూ.1700 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారని తెలిపారు. తమపై ఐటి విభాగం ప్రక్రియ నిలిపివేయాలంటూ ఇప్పటికే పార్టీ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఎలాంటి ఫైనాన్స్ కు సంబంధించిన ఉత్తర్వులు లేకుండానే తాజాగా నోటీసులు ఇచ్చినట్లు వివేక్ ఆరోపించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని మండి పడ్డారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు గురువారం 2017- 2021 మధ్య కాలానికి ఆదాయప పన్ను విభాగం చేపట్టిన పున:పరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పున: పరిశీలన సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఇవే ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
Congress: జాతీయ కాంగ్రెస్ కు భారీ షాక్
- Advertisment -