Cm Kcr :మంచిర్యాల, జనతా న్యూస్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందు సింగరేణిలో భయంకర పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుందని, అందుకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన సభలో మాట్లాడారు.కాంగ్రెస్ అధికారంలో ఉండగా సింగరేణిని కేంద్రానికి 49 శాతం కట్టబెట్టిందని అన్నారు. కానీ సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా లాభాల బాటలోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. దసరా, దీపావళి సందర్భంగా వెయ్యి కోట్ల బోనస్ పంచుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా కేవలం 18 శాతం వాటనే లాభాలు ఇచ్చిందని, బీఆర్ఎస్ మాత్రం 32 శాతం ఇస్తోందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని అన్నారు.
కాంగ్రెస్ వాళ్లు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలంటున్నారు. 24 గంటల విద్యుత్ కావాలో? మూడు గంటల విద్యుత్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. అలాగే ధరణిని తీసేద్దామని అంటున్నారు. కానీ ధరణి వల్ల ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని అన్నారు.