Charlapalli Jail: హైదరాబాద్ జనత న్యూస్: కొన్ని ముఖ్యమైన కేసుల విషయంలో చర్లపల్లి జైలు పేరు వినిపిస్తూ ఉంటుంది. క్షణికా వేషంలో చేసిన నేరాలకు శిక్ష పడ్డ ఖైదీలు మొదలుకొని నేర ప్రవృత్తిని కలిగిన రౌడీలు, జైల్లో ఉన్న తమ పేరిట జూలం చలాయించే గ్యాంగ్ స్టర్లు, విప్లవ బాట పట్టిన మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ఖైదీలు, విద్యార్థి ఉద్యమ నాయకులు.. ఇలా ఈ జైల్లో గడిపిన వారెందరో.. ఈ జైలుకు ఎంతో చరిత్ర ఉంది. ఇది ప్రారంభమై మే 6 2024 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
చర్లపల్లి జైలును 2000 సంవత్సరం మే 5న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ జైలు నిర్మాణం కోసం 118 ఎకరాలు కేటాయించగా 18 నెలల్లో నిర్మాణం పూర్తయింది. ఇందులో జైలు, ప్రాంగణం 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. జైలు ఆవరణ మొత్తాన్ని భద్రత సిబ్బంది డేగ కన్నుతో కాపాల కాస్తుంటుంది.
చర్లపల్లి జై ల్లో సంస్కరణల ప్రయోగాలకు కేంద్ర బిందువుగా చెప్పవచ్చు . ఖైదీల సత్ప్రవర్తన కలిగేలా విద్య, వైద్యం, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి అంశాల నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తుంటారు. ఖైదీలచే ఎన్నుకోబడ్డ కమిటీలు, పాఠశాల నిర్వహణ, భోజన సదుపాయం కూరగాయలు సాగు వంటి పనులను అధికారులు పర్యవేక్షణలో చేస్తుంటారు. ఖైదీలు వృత్తి, నైపుణ్యం, శిక్షణ ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేయడం వంటివి జైలు ఆధ్వర్యంలో నడిచే బంకులో ఉద్యోగ అవకాశం కల్పిస్తుంటారు.