Sunday, November 1, 2026

బెజ్జంకిలో బీఆర్ఎస్ ప్రచారం

జనతా న్యూస్ బెజ్జంకి : శాసనసభ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ మశహిళా విభాగం బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం స్థానిక ఎంపీటీసీ గుబిరె శారద మల్లేశం ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గుబెరె శారద మల్లేశం మాట్లాడుతూ బెజ్జంకి గ్రామ ప్రజలు అంతా బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, రసమయికే మళ్లీ పట్టం కడతామని స్పష్టం చేశారని పేర్కొన్నారు. 400కే గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయలు ఇలా అనేక సంక్షేమ పథకాలను కెసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, గతంలో కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన కెసిఆర్ ప్రభుత్వానికే మళ్లీ ఓటు వేస్తామని ప్రజానికం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండలం అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page