జనతా న్యూస్ బెజ్జంకి : శాసనసభ ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ మశహిళా విభాగం బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం స్థానిక ఎంపీటీసీ గుబిరె శారద మల్లేశం ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గుబెరె శారద మల్లేశం మాట్లాడుతూ బెజ్జంకి గ్రామ ప్రజలు అంతా బిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, రసమయికే మళ్లీ పట్టం కడతామని స్పష్టం చేశారని పేర్కొన్నారు. 400కే గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయలు ఇలా అనేక సంక్షేమ పథకాలను కెసిఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, గతంలో కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి తో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించిన కెసిఆర్ ప్రభుత్వానికే మళ్లీ ఓటు వేస్తామని ప్రజానికం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండలం అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో బీఆర్ఎస్ ప్రచారం
- Advertisment -