Congress: జనత న్యూస్ బెజ్జంకి: బెజ్జంకి మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఒoటేల సంపత్ రెడ్డి ని బుధవారం ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది అనుచరులతో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సంపత్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండం మల్లారెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ రజిత సంతు తాజా మాజీ వార్డు సభ్యులు సుజాత వెంకటరెడ్డి మెరుగు భారతవ్వ కనకయ్య మెండ రాజు పడాల అశోక్ అటికం సత్తయ్య వెంకటేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,నాయకులు జంగిడి సంజీవరెడ్డి అజయ్ మధు గోవర్దన్ రెడ్డి గణేష్ రెడ్డి నవీన్ తిరుపతి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకి: కాంగ్రెస్ లో భారీగా చేరికలు
- Advertisment -