Thursday, October 29, 2026

బెజ్జంకి: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన

జనతన్యూస్ బెజ్జంకి : రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిద్ధిపేట జిల్లా  బెజ్జంకి మండల కేంద్రంలోని  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని బెజ్జంకి ఎస్సై జి కృష్ణారెడ్డి, సిద్దిపేట రూరల్ సిఐ శ్రీనివాస్  కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు యువకులకు, ఓటు హక్కు, ఓటు విలువ గురించి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.  అనంతరం  పోలీస్ అధికారులు మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికలలో ఓటు వేసుకునే స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పిస్తామని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలన్నారు.   ప్రజలతోపాటు యువకులు పోలీస్ అధికారులతో పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని  అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, మనకు నచ్చిన ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి ఓటు ఒక వజ్రాయుధమని తెలిపారు.  ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుంటే 1950 కి కాల్ చేయాలని, సైబర్ నేరాలు జరిగితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలనిసూచించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page