Tuesday, October 27, 2026

Beers :పడిపోయిన బీర్ల అమ్మకాలు.. అధ్యయనానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ..

Beers : ముంబయ్: మద్యపానాన్ని నిషేధించాలని మహిళలు నిత్యం ఆందోళనలు చేస్తుంటారు. కానీ అత్యధిక ఆదాయం మద్యంతోనే కనుక వాటి అమ్మకాలను నిషేధించడానికి ప్రభుత్వాలు ముందుకు రావు. అయితే తాజాగా ఆ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. దీంతో ఆదాయం పడిపోయింది. బీర్ల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యకంగా కమిటీ వేసింది. స్కూళ్లలో సమస్యలు పరిష్కరించాడానికి కమిటీ అక్కర్లేదా? అని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. ఎందు కంటే నవంబర్ 1 నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. పర్మిట్ రూమ్ మద్యంపై వ్యాట్ ను 5 శాతం పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 5 శాతం వ్యాట్ ఉండగా.. మరో 5 శాతం పెంచితే మొత్తం 10 శాతానికి మారుతుంది. దేశంలో బీరుపై అత్యంత ఖరీదైన పన్ను మహారాష్ట్రలోనే ఉంది. ఆ తరువాత కర్ణాటక, గోవా ఉన్నాయి. అయితే వ్యాట్ పెంచకముందే బీర్ల అమ్మకాలు తగ్గడంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ల సేల్స్ తగ్గడంపై ప్రత్యేక కమిటీ వేయనుంది.

అయితే దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. మద్యపానం అమ్మకాలపై ప్రభుత్వం ఎందుకు అంత ఇంట్రెస్టు పెడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇలా మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టడం సరికాదని కొందరు విమర్శిస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page