Arya Telugu Movie: వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఆర్య సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయి 2024 మే 7 నాటికి 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీకి సుకుమార్ డైరెక్షన్ వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా 2004 మే 7న ఆర్య చిత్రం విడుదలైంది. దీనిని దిల్ రాజు నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా అనురాధ మెహతా నటించారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత సినిమాకు వచ్చిన క్రేజ్ తో 125 రోజుల వరకు నడిచింది. ఆర్య సినిమా తెలుగులోనే కాకుండా మలయాళం ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయింది. దీంతో అల్లు అర్జున్ కు అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆర్యతో అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ జీవితం కూడా మారిపోయింది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కు కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
Arya Telugu Movie: ‘ఆర్య’కు 20 ఏళ్లు..
- Advertisment -