Saturday, October 24, 2026

బాణసంచా దుకాణాల దరఖాస్తు గడువు 27

కరీంనగర్ పోలీస్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బరాయుడు

కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి): దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు ఈనెల 27వ తేదీలోగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు మరియు రక్షణ చర్యలు చేపట్టిన వారికే అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. బాణసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు వివిధ ప్రభుత్వ శాఖల నిరభ్యంతర పత్రాలు పొందిన తర్వాతే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలోని భద్రత చర్యలు పరిశీలించి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

దరఖాస్తు చేసుకునే వ్యాపారులు దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, 500 రూపాయల చలాన్ ను జతచేస్తూ ఐదు సెట్స్ ల జిరాక్స్ లను ను పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు అందజేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ తర్వాత అందజేసే దరఖాస్తులు స్వీకరించబడవని స్పష్టం చేశారు.నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ప్రజలు నివసించే ప్రాంతాలు, వివిధ దుకాణాల వద్ద మరియు ఇతర ప్రదేశాలలో చట్టాన్ని అతిక్రమించి బాణసంచా విక్రయాలకు పాల్పడితే ప్రజల రక్షణకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున అట్టి వ్యాపారులపట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారిని నేరస్థులుగా పరిగణించి వారిపై చట్ట ప్రకారం తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page