Ap Politics: విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ నాయకుల పార్టీల మార్పులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ డోక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. కొంతకాలంగా ఆయన తాడికొండ సీటును ఆశిస్తున్నారు. ఈ సీటు దక్కకపోవడంతో ఆయన వైసీపీకి చెందిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆయన పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీలో చేరుతారా? అనే వార్తలు వస్తున్నా.. ఆ విషయంలో తటస్టంగా ఉంటున్నారు. కాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ 2004, 2009లో తాడికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Ap Politics: ఏపీలో వైసీపీకి షాక్..
- Advertisment -